జై లవ కుశ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఏమన్నారంటే..
జై లవ కుశ షూటింగ్ పూర్తైంది. నిర్మాణాంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సారిగా ఈ మూవీలో త్రిపాత్రిభినయం చేస్తున్న విషయం విదితమే. ట్రైలర్ ఇటీవలే విడుదలై దుమ్ము రేపింది. అంతేకాదు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. జై లవ కుశ మూవీ సెన్సార్ పూర్తైందని ఆ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు చాలా అభినందించారని డైరెక్టర్ బాబీ తెలిపారు. పండుగ మొదలైందని.. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు.
 
 
Tags :Jai Lava Kusa, JUNIOR NTR, sensor board, Kalyan Ram, Directer bobby
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.