శ్రద్ధాకు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ సరసన ఈ సినిమా కోసం ఎందరో హీరోయిన్లను కాదని.. చివరికి శ్రద్ధా కపూర్‌ని సెలక్ట్ చేశారు. దీంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శ్రద్ధా మంగళవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటోంది. కానీ వారం ముందే హైదరాబాద్‌కు చేరుకుందీ ముద్దుగుమ్మ. డైలాగ్స్‌ అన్నీ మాస్టర్‌ని పెట్టుకుని మరీ నేర్చేసుకుందని సమాచారం. అయితే ఇవాళ సెట్‌లో ఆమెకు ప్రభాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. శ్రద్ధా కోసం 18రకాల హైదరాబాదీ వంటకాలను సిద్ధం చేయించారు. ఈ వంటకాలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వంటకాలన్నీ చూసి శ్రద్దా అవాక్కయిందని టాక్.
 
 
Tags :Prabhas, sraddha kapoor