‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేసింది..!
ప్రస్తుతం దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారిన తెలుగు చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసిన ఉత్తరాది భామ షాలిని పాండే త్వరలోనే కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. జీవీ ప్రకాష్‌ హీరోగా తెరకెక్కబోతున్న ‘100% కాదల్‌’ చిత్రంలో షాలినిని హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఇంతకుముందు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే వ్యక్తిగత కారణాలతో లావణ్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ‘అర్జున్‌రెడ్డి’తో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన షాలిని పాండేను ఎంపిక చేశారు. ఇదొక్కటే కాదు, కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
 
           కానీ, కథల ఎంపిక జాగ్రత్త వహిస్తూ, విభిన్నమైన ప్రేమకథతో కూడిన ‘100% కాదల్‌’కి ఓకే చెప్పింది. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన తెలుగు చిత్రం ‘100% లవ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. ఆగస్టులోనే షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, లావణ్య తప్పుకోవడంతో సెట్స్‌పైకి వెళ్లేందుకు ఆలస్యమైంది. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘100% కాదల్‌’ చిత్రానికి చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.