రకుల్‌ ఫ్యామిలీ నుంచి హీరో రాబోతున్నాడు!
అవునండీ మీరు చదివింది నిజమే. టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ నుంచి తర్వలో హీరో రాబోతున్నాడు. అతడెవరో కాదు రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్. ఈ విషయాన్ని రకుల్ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది.
 
‘రాక్ ఎన్ రోల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో అమన్ హీరోగా నటించాడు. సెక్స్, గన్స్, కొంతమంది ఇడియట్స్ ప్రధానాంశంగా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన రకుల్..‘‘ఆల్ ద బెస్ట్ మై లిటిల్ బ్రదర్. ఇది బిగినింగ్ మాత్రమే. నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొంది. 
 
 
Tags :RakulPreeth Singh, BROTHER, HERO, short film
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.