ఉదయభాను బిల్డప్ ఇస్తోంది.. రామ్-లక్ష్మణ్ పంచ్
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘గౌతమ్ నందా’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఆడియో వేడుకను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు ఉదయ భాను హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షో సందర్భంగా యాంకర్‌కు గట్టి పంచ్‌నే ఇచ్చారు ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌లు. ఒక్కొక్కరిని స్టేజీపైకి ఆహ్వానిస్తూ వారిపై పొగడ్తల వర్షం కురిపించారు ఉదయభాను. రామ్-లక్ష్మణ్‌లనూ ఇలాగే పొగడ్తలతో ముంచెత్తారు. అయితే.. వారు స్టేజీపైకి రాగానే ఆమె చెప్పిందంతా నిజం కాదనేశారు రామ్-లక్ష్మణ్. ‘‘మా గురించి ఉదయభాను బాగా బిల్డప్ ఇస్తోంది. కానీ, అదంతా నిజం కాదు. మా మీద అభిమానం కొద్దీ అలా బిల్డప్ ఇస్తోందంతే’’ అని పంచ్ వేసేశారు. తమ ఫేవరెట్ హీరోయిన్ ఉదయ భాను అని, తాము హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్‌లో హీరోయిన్‌గా నటించిందని, ఆ అభిమానంతోనే అలా తమపై పొగడ్తలు కురిపించిందని అన్నారు. ఇక, ఆమె గురించి మాట్లాడుతూ.. ‘‘నువ్వు వస్తేనే బ్రైట్‌. మరి, ఇంత బ్రైట్ చీర కట్టుకుని వస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?’’ అంటూ కామెంట్ చేశారు రామ్-లక్ష్మణ్.
Tags :Udaya bhanu, ram-laxman, gautamnanda, gautamnanda audio launch