ఆ పదం వాడడానికే సిగ్గుగా ఉంది: నటి గౌతమి
ప్రముఖ మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్‌ అరెస్టు అనంతరం బాధితురాలికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమి ఈ విషయంపై మాట్లాడారు. ఈ కేసులో బాధితురాలి పేరును దాచకూడదని కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు.
 
‘‘అందరూ ఆమెను బాధితురాలు అని అంటున్నారు. అసలు ఆ పదం వాడడానికే సిగ్గుగా ఉంది. న్యాయం కోసం పోరాడుతున్న ఆమె నా దృష్టిలో హీరో. ఇంత జరిగాక కూడా నలుగురిలో తలెత్తుకుని తిరగాలంటే ఎంతో మనోధైర్యం కావాలి. సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొని న్యాయం కోసం పోరాడుతున్న ఆమె పేరును దాచాల్సిన అవసరం లేదు. కానీ అందుకు చట్టం ఒప్పుకోదు.’’ అని గౌతమి చెప్పుకొచ్చారు.
 
 
Tags :Gouthami, Kamal Hassan, malayalam, actor dileep