అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేయొచ్చు: షారూక్
బాలీవుడ్ బాద్‌షా.. ఈ పేరు కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇటీవల వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా.. అతడి ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ కుర్రాడిలా కనిపించడం షారూక్ ప్రత్యేకత. తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనుకునే బాలీవుడ్ అభిమానులు ఎంతో మంది. వాటన్నిటికీ గూగుల్ సరైన ఆన్సర్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. షారూక్ మాత్రం చెప్పేశారు. తన ఫోన్ నంబర్‌తో సహా వ్యక్తిగత విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 
         అంత పెద్ద స్టార్ హీరోకు వ్యక్తిగత జెట్ (చార్టెడ్ ఫ్లైట్) ఉండకపోవడమేంటి అని చాలా మంది అభిమానులు చర్చించుకునే ప్రశ్న. కానీ, దానికి షారూక్ నుంచి వచ్చిన సమాధానం మాత్రం ‘నో’! అవును షారూక్‌కు ఇప్పటిదాకా వ్యక్తిగత జెట్ లేదు కానీ.. తీసుకునేందుకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించానని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా చేయబోతున్నానని, ఆ సినిమా స్టార్ అయ్యాక పర్సనల్ జెట్ తీసుకుంటానని చెప్పారు. అంతేకాదు.. ఇప్పటిదాకా తాను ఏ టాటూలూ వేయించుకోలేదని, జబ్ హారీ మెట్ సెజాల్ సినిమా కోసం కుడి భుజం, ఛాతి మీద తాత్కాలిక టాటూలు వేయించుకున్నానని చెప్పారు. టాటూలంటే తనకు చచ్చేంత భయమని వెల్లడించారు.
 
         ఇక, తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను వెల్లడించారు షారూక్. ‘‘5559960321.. ఇదే నా ఫోన్ నంబర్. అర్ధరాత్రి తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను తప్పకుండా ఫోన్ ఎత్తుతాను. ఎత్తలేని పరిస్థితులుంటే.. ఓ మెసేజ్ పెట్టండి. ఓ ఎమోజీతో నేను కూడా రిప్లై ఇస్తాను’’ అంటూ సమాధానమిచ్చారు. ఇక, తన సొంత పేరును కూడా వెల్లడించారీ స్టార్ హీరో. తన అసలు పేరు కూడా షారూక్ ఖాన్ అనే చెప్పుకొచ్చారు. తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అదేనని చెప్పారు. ఇంటర్నెట్‌లో రకరకాల పేర్లు వినిపిస్తున్నా వాటి గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చారు. మరి, ఫోన్ నంబర్ అయితే షారూక్ ఇచ్చారు గానీ.. అర్ధరాత్రి తర్వాతే చేయాలన్న షరతు విధించిన ఆయన్ను.. ఆ సమయంలో ఎంత మంది అభిమానులు డిస్టర్బ్ చేస్తారో! అలా ఏ అభిమానీ చేయడని ఆశిద్దాం!!
 
Tags :sharukh khan, shahrukh personal, shahrukh phone
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.