‘బిగ్‌బాస్ కోసం నా కొడుకును హాస్టల్‌లో జాయిన్ చేశా’
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్‌బాస్’ షో ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. 14 మంది పార్టిసిపేట్స్‌ను ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోకి పంపేముందు ఒక్కొక్కరి ఫీలింగ్‌ను తెలుసుకుని, ధైర్యం చెప్పారు ఎన్టీఆర్.
 
ఈ సందర్భంగా ఏడో పార్టిసిపేట్‌గా వచ్చిన నటి జ్యోతి ఈ షో కోసం తన కొడుకును హాస్టల్‌లో జాయిన్ చేసినట్లు చెప్పారు. సినిమాల్లో తాను వేసిన క్యారెక్టర్లను చూసి తనను అందరూ ఐటమ్ గాళ్‌గా నిర్ణయించారని, కానీ తానేంటో ఈ షోలో నిరూపించుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన గురించి ఒక మాటలో చెప్పాలంటే తాను ఒక మంచి తల్లినని ఆమె అన్నారు.
 
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే వాళ్లు 70 రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాలనే నియమం ఉన్న విషయం విధితమే. 
 
బిగ్‌బాస్‌లో పాల్గొన్న 14 మంది వీళ్లే..
1. నటి అర్చన
2. బుల్లితెర నటుడు సమీర్
3. ముమైత్ ఖాన్
4. యువ నటుడు ప్రిన్స్
5. సింగర్ మధుప్రియ
6. సంపూర్ణేష్ బాబు(నరసింహాచారి)
7. ఐటమ్ గాళ్ జ్యోతి
8. సింగర్ కల్పన
9. మహేష్ కత్తి
10. యాంకర్ కత్తి కార్తీక
11. నటుడు శివబాలాజీ
12. బుల్లితెర నటి హరితేజ
13. నటుడు ఆదర్శ్
14. కమెడియన్ ధన్ రాజ్ 
Tags :Big Boss show, Character Artist Jyothi, son, joins, Hostel