అర్జున్‌తో అను
‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’లో అల్లు అర్జున్‌ సరసన నటించడానికి అను ఇమ్మాన్యుయల్‌ ఎంపికయ్యారు. రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కె.నాగబాబు సమర్పిస్తున్నారు. లగడపాటి శిరీషా, లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌ సరసన నటించడానికి చాలా మంది పేర్లను పరిశీలించాం. ఆ క్రమంలోనే అను ఇమ్మాన్యుయల్‌ గత చిత్రాలు చూశాం. ఆమె అందం, అభినయం ఆకట్టుకోవడంతో మా చిత్రంలో నాయికగా ఎంపిక చేశాం. ఆగస్ట్‌ మొదటివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. నాగబాబుగారితోనూ, బన్నీవాసుతోనూ కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. విశాల్‌-శేఖర్‌ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు’’ అని చెప్పారు. అర్జున్‌, శరత్‌కుమార్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబు, కెమెరా: రాజీవ్‌ రవి.