ADVT
శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం; తిథి: ద్వాదశి రా. 8.23 తదుపరి త్రయోదశి; నక్షత్రం: రోహిణి మ. 12.26 తదుపరి మృగశిర;
 
వర్జ్యం: సా.5.35-7.03; దుర్ముహూర్తం: ఉ.9.07-9.51, మ.12.48-1.32; అమృతఘడియలు: ఉ.9.24-10.55, రా.2.25-3.54; రాహుకాలం: ఉ.10.30-12.00; సూర్యోదయం: 6.55; సూర్యాస్తమయం: 5.57
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 18, 2019)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సోదరీ సోదరులకు సంబంధించిన విషయాలపై పెద్దలతో చర్చిస్తారు. స్టేషనరీ, రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

సమావేశాలు, వేడుకల కోసం ఖర్చులు అధికం. న్యాయ, రవాణా, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలించకపోవచ్చు. సకాలంలో నిదులు చేతికి అందకపోవడంతో నిరాశ చెందుతారు.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

పూజలు, ఉత్సవాలు, సంస్మరణల్లో పాల్గొంటారు. రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వాయిదాలపై వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, టీవీ, పర్యాటక రంగాల వారు మాటపడాల్సి వస్తుంది. వినోదాలు, బృందకార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆస్పత్రులు, హోటల్‌, రిటైల్‌ రంగాల వారికి ఖర్చులు అధికం. బృందకార్యక్రమాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రేమానుబంధాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన మిగులుస్తుంది. వివాహాది శుభకార్యాలు, వేడుకల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారు అసౌకర్యానికి గురవుతారు. సమావేశాలు, పర్యటనల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ల విషయం చర్చిస్తారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

సన్నిహితుల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు, విద్య, షాపింగ్‌కు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. విలువైన పత్రాలు అందుకుంటారు.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామి ఆలోచనల్ని గమనించి నడుచుకోవాలి. షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందు, వినోదాల్లో పరిమితి పాటించాలి. హోటల్‌, వైద్యం, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

పొదుపు పథకాలు, విద్యా విషయాలకు సంబంధించి ఒక సమాచారం కలవరపెడుతుంది. దూరప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి మెయిల్స్‌, మెసేజ్‌లు అందుకుంటారు.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

వేడుకలకు ఏర్పాట్ల విషయంలో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వ్యవహార శైలి మనస్తాపం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన వారికి కొత్త పరిచ యాలు లాభిస్తాయి. మార్పులు, చేర్పులకు అనకూలం.
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 17, 2019)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు, సమావేశాలకు అనుకూలం. వాహనయోగం ఉంది. సోదరీ, సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు. ఇంటర్వూల్లో విజయం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

ప్రయాణాలు, వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి. సమావేశాలు, బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

గత అనుభవంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు. పూర్వ మిత్రుల కలయికతో ఆనందం. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, పన్నులు, బీమా, గ్రాట్యుటీ, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

భాగస్వామికి సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. వేడుకలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. రాజకీయ, సినీరంగాల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబసభ్యులతో దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

బంధు మిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూనియన్‌ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సంతాన సిద్ధికి అనుకూలం.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

కుటుంబసభ్యులతో ప్రయాణాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహ నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం మార్పు విషయంలో సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

రుణాలు, పెట్టుబడులు, షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి కీలకపత్రాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బృంద కార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత అనుభవంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.