శ్రీవికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం; తిథి: షష్ఠి రా. 11.54 తదుపరి సప్తమి; నక్షత్రం: శతభిషం రా. 12.08 తదుపరి పూర్వాభాద్ర; వర్జ్యం: శే.ఉ.7.02 వరకు; దుర్ముహూర్తం: సా.5.05-5.57; అమృతఘడియలు: సా.4.02-5.50; రాహుకాలం: సా.4.30-6.00; సూర్యోదయం: 5.47; సూర్యాస్తమయం: 6.49
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జూన్ 24, 2019)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

గతంలో చేసిన కృషికి ఫలితం అందుకుంటారు. దూరంలో ఉన్న కుటుంబసభ్యులు ఇల్లు చేరతారు. సినీ, రాజకీయ రంగాలవారికి శుభప్రదం. స్థిరాస్తి, వారసత్వ విషయాలు కొలిక్కివస్తాయి. కుటుంబసభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

బంధుమిత్రులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

పెద్దల చొరవతో ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. సంకల్పసిద్ధికి అనుకూలమైన రోజు.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కళారంగాల వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. లక్ష్యాలు సిద్ధించడంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వారసత్వ విషయాలు కొలిక్కివస్తాయి. బీమా, గ్రాట్యుటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యవహారాలకు అనుకూలం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రదర్శనలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. గౌరవ పదవులు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. వైద్యం, హోటల్‌, పరిశ్రమల రంగాలవారు ప్రముఖుల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

చిన్నారులు, ప్రియతముల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూల సమమం. వృత్తి విద్యా కోర్సులు చదివేవారికి పోత్సాహకరం. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. బకాయిలు వసూలవుతాయి. కుటుంబ పెద్దలను స్మరించుకుంటారు. ఫర్నిచర్‌, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, చర్చలకు అనుకూలం. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రియతములతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. రవాణా, బోధన రంగాల వారు నైపుణ్యంతో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్‌, హోటల్‌, ఆస్పత్రి రంగాలవారు అదనపు ఆదాయం అందుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాల కోసం ఖర్చు చేస్తారు.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మనసు కొత్తదనం కోరుకుంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జూన్ 23, 2019)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను సమీక్షించుకుంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. సంకల్పసిద్ధికి అనుకూల సమయం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

కమ్యూనికేషన్లు, రవాణా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలం. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి ఉత్సాహం కలిగిస్తుంది. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పై అధికారుల సహకారం అందుకుంటారు.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

రక్షణ, న్యాయ, బోధన, రవాణా, విదేవీ వ్యాపార రంగాల వారికి అనుకూలం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దూరప్రయాణాలు, ఉన్నత విద్యా వ్యవహారాలపై నిర్ణయానికి వస్తారు. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

ఉన్నత విద్య, విదేవీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో విజయం సాధిస్తారు. వారసత్వ విషయాలు కొలిక్కి వస్తాయి. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందులు, సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. లక్ష్యసాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అంచనాలు ఫలిస్తాయు. ప్రియతముల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం అందుకుంటారు. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

గృహనిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలను సమీక్షించుకుంటారు. కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. రియల్‌ఎస్టేట్‌ నిర్మాణ రంగాల్లోని వారికి శుభప్రదం.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. సోదరీసోదరుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్‌, సందేశాలు ఆవేదన కలిగిస్తాయి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

యోగా, ధ్యానాలు, డైటింగ్‌ అంశాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. మెడికల్‌ క్లెయిమ్స్‌ మంజూరవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యం, హోటల్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిర్ణయాలు, సంతానప్రాప్తి విషయంలో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.