ADVT
కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ సఫారీలు
13-02-2018 22:01:51
పోర్ట్ ఎలిజబెత్: భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో సౌతాఫ్రికా లక్ష్య చేధనలో తడబడింది. భారత్ నిర్దేశించిన టార్గెట్‌ని చేరుకొనే క్రమంలో ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్‌కి దిగిన సఫారీలకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే బుమ్రా వేసిన 10 ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ మార్క్‌రం(32) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో డుమినీ(1) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అనంతరం కీలక ఆటగాడు డివిలియర్స్‌(6)కు పాండ్య బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంకా 201 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఆమ్లా(26), మిల్లర్(14) ఉన్నారు.
Tags : India VS South Africa, Cricket, ODI series

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.