రైల్వేస్టేషన్‌లో దిగి.. కన్వేయర్ బెల్ట్‌పైకి తనే ఎక్కి..
13-02-2018 22:01:03
బీజింగ్: జాగ్రత్త అవసరమే కానీ.. అతి జాగ్రత్త అస్సలు పనికి రాదు. చైనాలో ఒకావిడ ఈ అతిజాగ్రత్తతోనే వార్తల్లో నిలిచింది. ఓ రైల్వే స్టేషన్‌లో దిగిన ఆవిడ.. లగేజ్ స్కానింగ్ మెషీన్‌లోకి దూరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న ప్రారంభం కానున్న చైనా కొత్త సంవత్సర వేడుకలకు జనం పెద్ద ఎత్తున సొంతూళ్లకు చేరుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఈ హడావుడిలోనే ఓ మహిళ.. దక్షిణ చైనాలోని డోన్గ్వాన్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి లగేజ్ స్కానింగ్ మెషీన్ దగ్గరకు వెళ్లింది. స్కానింగ్ మెషీన్‌లో బ్యాగ్ పెట్టకుండా.. కన్వేయర్ బెల్ట్‌పైకి తనే ఎక్కి కూర్చుంది. అలాగే లోపలి నుంచి బయటకు వచ్చేసింది. లోపలి నుంచి ఆవిడ రావడం చూసిన సెక్యురిటీ వాళ్లు షాక్ అయ్యారు. ఏంటమ్మా ఇది అని అడిగితే... అమ్మో బ్యాగు పోతే.. ఎవరు బాధ్యత వహిస్తారు.. సెక్యురిటీ వాళ్లపై నాకు నమ్మకం లేదంటూ సమాధానమిచ్చింది. అమ్మడి సమాధానానికి మొదట విస్తుపోయినా.. ఆ తర్వాత నవ్వుకున్నారు. ఈ నెల 11న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Tags : scanning machine, China, Railway Stations, Woman
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.