ADVT
బ్రిటన్ రాచబిడ్డలు ఎలా పెరుగుతున్నారో తెలుసా?
13-02-2018 21:47:17
లండన్: బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ఏ వార్తైనా సరే.. జనంలో ఆసక్తిరేపుతుంది. తాజాగా ప్రిన్స్ విలియం దంపతులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. పిల్లల పెంపకంలో వీరిద్దరూ అనుసరిస్తున్న పద్ధతులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమ ముద్దుల కొడుకు జార్జ్, గారాలపట్టి చార్లెట్టీల పెంపకంలో సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
 
నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లను అలవాటు చేస్తున్నారు. చిన్న వయస్సు నుంచే వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పుతున్నారు. ఈ విషయంలో మాత్రం విలియమ్స్, కేట్ దంపతులు మిగిలిన తల్లిదండ్రుల కంటే విభిన్నంగా ఆలోచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు తమ పిల్లలను ఆమడ దూరం పెడుతున్నారు. సంప్రదాయ ఆటలనే ప్రోత్సహిస్తున్నారట. వాళ్ల ఆటవిడుపు కేవలం బొమ్మలు, మనుషులతో ఉండేలా చూస్తున్నారట. జనానికి దగ్గరగా.. వాళ్లతో అనుబంధం పెంచుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నారట. యాంత్రిక జీవనానికి వాళ్లు అలవాటు పడకుండా చేయడానికే ఇలా చేస్తున్నారట. వీలైనంత వరకు ప్లే గ్రౌండ్‌లకు తీసుకెళ్లి ఆడిస్తున్నారట. పిల్లల పెంపకంలో విలియమ్, కేట్ దంపతులు చూపుతున్న శ్రద్ధ అందరి ప్రశంసలు పొందుతోంది. 
Tags : Catherine, Prince Williams, children, toys

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.