ADVT
రైతులందరూ హనుమాన్ చాలీసా చదివితే..
13-02-2018 20:33:58
భోపాల్: హనుమాన్ చాలీసా చదివితే.. ఎలాంటి భయాలు ఉండవని హిందువుల నమ్మకం. ఎలాంటి కష్టాన్నైనా.. ఆ శ్రీరామబంటు తొలగించేస్తాడని పూర్తిగా విశ్వసిస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత రమేశ్ సక్సేనా.. హనుమాన్ చాలీసాతో మరో ఉపయోగాన్ని కూడా చెప్పాడు. ప్రకృతి విపత్తుల నుంచి రైతులు బయటపడాలంటే చాలీసా పఠించాలని సూచిస్తున్నాడు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ తుఫాన్ సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం మధ్యప్రదేశ్ రైతులను హెచ్చరించింది. దీంతో రైతులకు ధైర్యం చెబుతూ సక్సేనా ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. పంట బాగా పండి ఇంటికి తీసుకు వెళదామనుకునే సమయంలో ఏ వర్షమో.. తుఫానో వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది. అప్పుడు రైతు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి ఊహించని కష్టాలకు చెక్ పెట్టాలంటే.. హనుమాన్ చాలీసా పఠనం మాత్రమే పరిష్కారం. ఎలాంటి ప్రకృతి విపత్తునుంచైనా సులభంగా బయటపడొచ్చు" అంటూ భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో మధ్యప్రదేశ్‌లో వైరల్ అవుతోంది. సక్సేనా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేవుడిపై భారం వెయ్యాలని చెప్పడం మాని.. రైతు సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాలని ప్రభుత్వానికి చురకలంటిస్తున్నాయి.
Tags : formers, hanuman chalisa, bjp leader, madhyapradesh

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.