ADVT
భారత్‌కు శుభారంభం.. సఫారీలపై ఘన విజయం!
13-02-2018 20:32:07
పోచెఫ్‌స్ర్టూమ్‌: ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్ మహిళ జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ మిథాలీరాజ్‌(54) చెలరేగిపోవడంతో టీం ఇండియా సనాయాస విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
 
165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 47 పరుగుల వద్దే మంధనా(28) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే హర్మన్‌ప్రీత్(0) కూడా పెవిలియన్ బాటపట్టింది. ఈ దశలో మిథాలీ వేగం పెంచింది. 48 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 54 పరుగులు చేసింది. మిథాలీకి వేదా కృష్ణమూర్తి, జెమియా రోడ్రిగ్స్‌(37) మంచి మద్దతునిచ్చారు. దీంతో భారత్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Tags : India VS South Africa, Womens Cricket, Mithali Raj

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.