ADVT
ఆఖర్లో తడబడిన భారత్.. సౌతాఫ్రికా టార్గెట్ 275
13-02-2018 20:21:23
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ ఆఖర్లో తడబడింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బరిలోకి దిగిన భారత్‌‌కు ఓపెనర్లు ధవన్, రోహిత్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే 48 పరుగుల వద్దే ధవన్ పెవిలియన్ చేరడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు భారాన్ని తమపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే విరాట్ కోహ్లీ రన్‌ ఔట్ కావడంతో స్కోర్ కాస్త మందగించింది. ఈ దశలో రోహిత్ వికెట్ కాపాడుకుంటూ.. స్కోర్ పెంచేందుకు కృషి చేశాడు.
 
ఈ నేపథ్యంలో తన కెరీర్‌లో 17వ సెంచరీ నమోదు చేసిన రోహిత్ ఆ తర్వాత కొంత సమయానికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే హార్థిక్ పాండ్యా కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో ఎన్‌గిడి 4, రబడ 1 వికెట్ తీశారు.
Tags : India VS South Africa, Cricket, ODI series

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.