ADVT
కోహ్లీని రనౌట్ చేసిన ప్రతిసారీ రెచ్చిపోయిన రోహిత్
13-02-2018 20:02:02
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ నేటి వన్డేలో మాత్రం శతకం బాదాడు. కెరీర్‌లో 17వ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 126 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు.
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య మరోమారు సమన్వయ లోపం ఏర్పడింది. ఫలితంగా కోహ్లీ రనౌట్ అయ్యాడు. రోహిత్ కారణంగా కోహ్లీ రనౌట్ కావడం ఇది ఏడోసారి. అయితే, కోహ్లీని రనౌట్ చేసిన ప్రతిసారీ రోహిత్ అద్భుతంగా ఆడాడు. రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించగా, రెండుసార్లు సెంచరీలు సాధించాడు. కోహ్లీ రనౌట్‌కు కారణమైన ప్రతిసారీ రోహిత్ చేసిన స్కోర్లు వరుసగా 57, 209, 264, 124, తాజాగా 115 పరుగులు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.