తాజ్ మహల్ సందర్శకులకు చేదు వార్త
13-02-2018 19:54:52
ఆగ్రా : తాజ్ మహల్ సందర్శకులకు ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రధాన సమాధిని సందర్శించాలంటే రూ.200 చెల్లించాలని తెలిపింది. ఎంట్రీ ఫీజును కూడా రూ.40 నుంచి రూ.50కి పెంచింది. ఉత్తర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తాజ్ మహల్‌ను పరిరక్షించేందుకు, జనం రద్దీని సక్రమంగా నిర్వహించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
 
ప్రస్తుతం ప్రధాన సమాధిని సందర్శించేందుకు రుసుము వసూలు చేయడం లేదు. దీనిని కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేయబోతున్నారు. రాబోయే తరాలవారికి తాజ్ మహల్‌ను సురక్షితంగా అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శర్మ తెలిపారు.
Tags : taj mahal, Uttarpradesh, Agra
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.