ADVT
వెనువెంటనే మూడు వికెట్లు..కష్టాల్లో భారత్!
13-02-2018 19:44:34
పోర్ట్ ఎలిజబెత్: భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్ ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఎన్‌గిడి వేసిన 43వ ఓవర్‌లో అప్పటివరకూ దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(115) కీపర్ క్లాసెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా(0) కూడా కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్‌గిడి వేసిన 44వ ఓవర్ 2 బంతి శ్రేయస్ అయ్యర్ కూడా తన సహచర ఆటగాళ్ల బాటలోనే కీపర్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు. దీంతో 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధోని(1), భువనేశ్వర్(1) ఉన్నారు.
Tags : India VS South Africa, Cricket, ODI series

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.