ADVT
అరగంటకు రూ. 2 కోట్లు ఇస్తామన్నా.. నో చెప్పిన హీరో
13-02-2018 19:13:06
బాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.. తనకు వచ్చిన రూ. 2 కోట్ల ఆఫర్లను తిరస్కరించాడు. తాజాగా ఓ శ్రీమంతుడు తన ఇంట్లో జరిగే పెళ్లిలో అరగంటపాటు డ్యాన్స్ చేయాల్సిందిగా రణ్‌వీర్‌ను కోరాడట. దీనికిగాను అతనికి రూ. 2 కోట్లు ఆఫర్ చేశారట. అయితే రణ్‌వీర్ సింగ్ మాత్రం దానికి నో చెప్పేశాడట. ప్రస్తుతం రణ్‌వీర్ నటిస్తున్న ‘గల్లీబాయ్’ సినిమా కారణంగానే ఈ ఆఫర్‌ని తిరస్కరించినట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నందున.. ఈ ఫోగ్రామ్ చేయలేనని సదరు శ్రీమంతుని కోరికను రణ్‌వీర్ సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘గల్లీబాయ్’ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.