ADVT
రోహిత్ ఈజ్ బ్యాక్.. ఐదో వన్డేలో అద్భుత శతకం
13-02-2018 19:11:48
పోర్ట్ ఎలిజబెత్: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ చెలరేగిపోయాడు. సౌతాఫ్రికాతో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వన్డేల్లో చిత్తుగా విఫలమైన రోహిత్.. ఐదో వన్డేలో మాత్రం విజృంభించాడు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ మరో శతకాన్ని నమోదు చేశాడు. మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ ఆరంభంలోనే ధవన్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో కోహ్లీతో కలిసి రోహిత్ 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 107 పరుగులు ఆడిన రోహిత్ 4 సిక్సులు, 10 ఫోర్లు ఆడిన తన కెరీర్‌లో 17వ సెంచరీ, సౌతాఫ్రికాపై 2వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ 36 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
Tags : rohit sharma, India VS South Africa, Cricket, ODI series

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.