ADVT
వరుస చోరీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ అరెస్టు
13-02-2018 17:01:27
హైదరాబాద్: ఇళ్ళల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ షేక్ అబేద్, జఫ్ఫార్ ఖాన్‌ అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ చైతన్యకుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రౌడీ షీటర్ షేక్ అబేద్‌పై రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు. అంతేగాక అతనిపై 17 అరెస్ట్‌ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని డీసీపీ తెలిపారు. కాగా... వీరిద్దరిని అరెస్టు చేసిన సందర్బంగా వారి వద్ద నుంచి రూ. 29వేల నగదు, బంగారు ఆభరణాలు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.