ADVT
బీజేపీకి ముఖ్యమంత్రి ఘాటు హెచ్చరిక
13-02-2018 17:00:22
అగర్తల : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. ఆ పార్టీ నిప్పుతో చెలగాటమాడుతోందన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ త్రిపుర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ (సీపీఎం) ఘన విజయం సాధిస్తుందని, ఎనిమిదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన శక్తులతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలహీనుడని ఎద్దేవా చేశారు.
 
తన పేరు (మాణిక్)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించారని, ఇది ఆయన బలహీనతను బయటపెట్టిందని ఆరోపించారు. ఓ వ్యక్తిపై ఇటువంటి ఆరోపణల దాడిని త్రిపుర ప్రజలు ఆమోదించరని తెలిపారు.
 
ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై మాణిక్ సర్కార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎఫ్‌టీ త్రిపురను విభజించి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోందని, అటువంటి పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు పెట్టుకుందని, ఇది నిప్పుతో చెలగాటమాడటమేనని విమర్శించారు.
 
త్రిపురలో ఇటీవల జరిగిన సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ మాణిక్యానికి బదులు వజ్రాన్ని తీసుకురావలసిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
త్రిపుర శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 18న జరుగుతుంది.
Tags : manik sarkar, BJP, Tripura, Narendra Modi

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.