ADVT
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం...
13-02-2018 15:31:25
అనంతపురం: జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మామిళ్ళపల్లి వద్దగల రోడ్డుపై వస్తున్న కారును లారీ ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.