ముగ్గురిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
13-02-2018 14:13:02
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్‌ దగ్గర మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు ప్రయాణిస్తున్న స్కూటర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఇదే సమయంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి సుబ్బమ్మ ఘటనాస్థలంలోనే మరణించగా, కూతురు, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.