ADVT
కాళేశ్వరంలో విషాదం...
13-02-2018 13:34:03
  • పురుగుల మందుతాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
  • ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం
జయశంకర్ భూపాలపల్లి: శివరాత్రి పర్వదినాన పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మంగళవారం విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే... ప్రియురాలు మృతిచెందగా... ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హన్మకొండ హంటర్ రోడ్డుకు చెందిన మేరుగు హరిప్రియ, పెండ్యాల సాయికుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే... ఏమైందో ఏమోగాని వారిద్దరూ మంగళవారం కాళేశ్వరానికి చేరుకున్నారు. అనంతరం తమవెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగారు. దీంతో ప్రియురాలు హరిప్రియ మృతిచెందగా ప్రియుడు సాయికుమార్‌కు సీరియస్‌గా ఉంది. గమనించిన చుట్టుపక్కలవారు సాయికుమార్‌ను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.