డివైడర్‌ను దాటి... బైక్‌ను ఢీకొట్టిన కారు
13-02-2018 11:47:49
  •  ఇన్ఫోసిస్‌ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం జోడిమెట్లలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలవైపు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇన్ఫోసిస్‌ ఉద్యోగి కృష్ణచైతన్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.