ADVT
ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. కరణ్ నగర్‌లో కొనసాగుతున్న కాల్పులు...
13-02-2018 11:04:03
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో తీవ్రవాదులు, భద్రతా దళాల మధ్య నిన్న మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంజ్వాన్ దాడి తరహాలోనే ఇక్కడికి సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపు‌పై దాడిచేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున 4:30 ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47 ఆయుధాలతో ఆర్మీ క్యాంపువైపు దూసుకొచ్చారు. సైనికులు వారిని పసిగట్టి కాల్పులు జరపడంతో... ఉగ్రవాదులు పారిపోయి ఓ ఇంట్లో తలదాచుకున్నారు. వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ సైనికులు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
 
కాగా శనివారం జమ్మూలోని సంజ్వాన్ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు అధికారుల సహా మొత్తం ఐదుగురు సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు, మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
Tags : Karan Nagar, jammu kashmir, CRPF, Terrorists attack, Encounter

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.