ADVT
వడగండ్ల వానతో బెంబేలెత్తిన జనం
13-02-2018 10:50:21
  • ఉమ్మడి జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
  • నిలిచిన విద్యుత్‌ సరఫరా
నిజామాబాద్, భైంసా: ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో వడగండ్ల వర్షం కురియడంతో జనం బెంబేలెత్తిపోయా రు. ఉధృతమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో భైంసా పట్టణం తడిసిముద్దయింది. ఏడు గంటల ప్రాంతంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అరగంట లోపే ఉధృతరూపం దాల్చిం ది. ఉధృతమైన గాలుల ధాటికి విద్యుత్‌ స రఫరా నిలిచిపోయింది. రోడ్లపై వర్షపు నీరు జోరుగా ప్రవహించింది. భైంసా వారాంతపు సంతలోని కొనుగోలుదారులు, విక్రయదారు లు భారీ వర్షంతో తడిసిముద్దయ్యారు. పలువురు వ్యాపారస్తుల సరుకులు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకపోయాయి. వాటిని కాపా డుకునేందుకుగా గాను వ్యాపారులు నానా తంటాలు పడ్టారు.
 
ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు వారాంతపు సంతవైపు ఉధృతితో ప్రవహించడం మూలంగా సమస్యలు ఏర్ప డ్డాయి. ఫుట్‌పాత్‌ వ్యాపారులు ఒక్కసారిగా కురిసిన ఉదృత రూపంతో కూడిన భారీ వ ర్షంతో ఇబ్బందులు పడ్డారు. తాము విక్రయిం చే వస్తువులు తడవకుండా ఉండేందుకుగా ను కవర్లతో కప్పుతూ తంటాలు పడ్డారు. లో తట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపో యిం ది. గుంతలమయమైన రోడ్లపై వర్షపు నీరు నిల్వడంతో విద్యుత్‌ సరఫరా లేని కారణంగా రాకపోకలు నిర్వహించే పాదచారులు ఇబ్బం దులు పడ్డారు. మురికి కాల్వలు పొంగి పొర్లి ప్రవహిస్తూ అంతర్గత రోడ్లపై ప్రవ హించడంతో వాహానాల రాకపోకలకు ఇ బ్బందులు కలిగాయి. పలు ప్రాంతాల్లోని పం ట చేలలో, ఇళ్ల ముందు నిల్వగా ఉంచిన కందుల దిగుబడులు వర్షంతో తడిసిపోయా యి. కందుల కొనుగోలు కేంద్రాల్లో ఆరుబ యట నిల్వగా ఉంచిన దిగుబడులు సైతం భారీ వర్షంతో తడిసిపోయాయి.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.