ADVT
ఆంధ్ర ‘పాంచ్‌’
13-02-2018 01:44:35
  •  గుజరాత్‌పై గెలుపు
  •  విజయ్‌ హజారే ట్రోఫీ
చెన్నై: విజయ్‌ హజారే టోర్నీలో ఆంధ్ర వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్‌-సిలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించింది. గుజరాత్‌ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర మరో 28 బంతులు మిగిలుండగానే ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (106 నాటౌట్‌) అజేయ శతకంతో పాటు అశ్విన్‌(99) రాణించి ఆంధ్రకు విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం జత చేశారు.
అంతకుముందు గుజరాత్‌.. కార్తీక్‌ రామన్‌ (4/32) దెబ్బకు 50 ఓవర్లలో 250 పరుగులు చేసింది. రుజుల్‌ భట్‌ (74), పీయుష్‌ చావ్లా (56) అర్ధ శతకాలు నమోదు చేశారు. తానాడిన ఐదు మ్యాచ్‌లనూ నెగ్గిన ఆంధ్ర 20 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్‌-డి లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరా బాద్‌ 149 పరుగుల భారీ తేడాతో జమ్మూ కశ్మీర్‌పై విజయం సాధించింది. మిగతా మ్యాచుల్లో గోవాపై ముంబై, మధ్యప్రదేశ్‌పై రాజస్థాన్‌, జార్ఖండ్‌పై ఛత్తీ్‌సగఢ్‌, సర్వీసెస్‌పై సౌరాష్ట్ర గెలిచాయి.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.