ADVT
ఆర్థికానికి ఊరట
13-02-2018 00:11:16
పారిశ్రామికం పెరిగింది, ద్రవ్యోల్బణం తగ్గింది
 
న్యూఢిల్లీ : పారిశ్రామిక రంగం డిసెంబరు నెలలో రికవరీ బాటను కొనసాగిస్తూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. యంత్రపరికరాలు, కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ అమ్మకాల్లో వృద్ధి కారణంగా పారిశ్రామికోత్పత్తి 7.1 శాతం పెరిగింది. 2016 డిసెంబరులో ఐఐపి వృద్ధి రేటు 2.4 శాతం ఉంది. నవంబరు నెల ఐఐపి వృద్ధి రేటును కేంద్రగణాంకాల శాఖ ఎగువకు 8.8 శాతానికి సవరించింది. ముందు ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇది 8.4 శాతం. పారిశ్రామికోత్పత్తి సూచిలో 77.63 శాతం వాటా ఉన్న తయారీ రంగం గణనీయంగా పుంజుకోవడం ఇందుకు కలిసి వచ్చింది. ఈ విభాగంలో వృద్ధిరేటు గత డిసెంబరుతో పోల్చితే 0.6 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది. యంత్రపరికరాల విభాగంలో వృద్ధిరేటు 6.2 శాతం నుంచి 16.4 శాతానికి దూసుకుపోయింది. నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా వృద్ధిరేటు 16.5 శాతంగా నమోదైంది. ఈ విభాగంలో వృద్ధిరేటు గత డిసెంబరులో కేవలం 0.2 శాతమే. వినియోగ ఆధారిత వర్గీకరణ ప్రకారం ప్రాథమిక వస్తువుల విభాగంలో 3.7 శాతం, ఇంటర్మీడియెట్‌ వస్తువుల విభాగంలో 6.2 శాతం, మౌలికవసతులు/నిర్మాణ రంగ వస్తువుల విభాగంలో 6.7 శాతం వృద్ధి నమోదయింది. కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో వృద్ధి 0.9 శాతం ఉంది. మొత్తం 23 పారిశ్రామిక విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
 
జనవరి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతం
కూరగాయలు, పళ్లు, ఇంధనాల ధరలు తగ్గడంతో జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతానికి దిగివచ్చింది. డిసెంబరులో ఇది 5.21 శాతం ఉంది. ఇది 17 నెలల గరిష్ఠ స్థాయి. గత జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.17 శాతం. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదల 4.7 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల్లో వృద్ధి 26.97 శాతం ఉండగా పళ్ల ధరలు 6.24 శాతం పెరిగాయి. ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం 7.73 శాతానికి దిగివచ్చింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.