ADVT
ప్యాసింజర్‌ వాహనాలకు గిరాకీ
12-02-2018 23:56:01
జనవరి అమ్మకాల్లో 7.57 శాతం వృద్ధి
 
గ్రేటర్‌ నోయిడా : ప్యాసింజర్‌ వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. గత జనవరిలో ఈ వాహనాల అమ్మకాలు 7.57 శాతం పెరిగి 2,85,477 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహనాల వృద్ధి ఇందుకు దోహదపడింది. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) గణాంకాల ప్రకారం.. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (పివి) అమ్మకాలు గత ఏడాది జనవరిలో 2,65,389 యూనిట్లుగా ఉన్నాయి. ఈ జనవరిలో కార్ల అమ్మకాలు మాత్రం 1.25 శాతం మేర తగ్గి 1,86,596 నుంచి 1,84,264కు చేరాయి. పివి అమ్మకాల్లో వృద్ధి అంచనాలకు తగిన విధంగానే ఉందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. జనవరిలో యుటిలిటీ వాహనాల (యువి) విక్రయాలు 85,850గా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలతో (62,263) పోల్చితే అమ్మకాల్లో వృద్ధి 37.88 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో అత్యధికంగా 86,874 యువిలు అమ్ముడయ్యాయి. రెండోసారి జనవరిలో అత్యధిక (85,850) అమ్మకాలు నమోదయ్యాయి. ఎంట్రీ స్థాయిలో కొత్త మోడళ్లు రావడం లేదని, ఫలితంగానే కార్ల అమ్మకాలు త క్కువగా నమోదు అవుతున్నాయని మాథుర్‌ తెలిపారు. చాలా మంది కస్టమర్లు క్రాసోవర్లు, కాంపాక్ట్‌ ఎస్‌యువిలకు మారిపోతున్నారని చెప్పారు. గత జనవరిలో మారుతి సుజుకీ దేశీయంగా 1,39,189 ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించింది. ఇదే నెలలో హ్యుండయ్‌ 45,508, టాటా మోటార్స్‌ 21,872 ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించాయి.
 
ఎలక్ర్టిక్‌ వాహనాలకు పరిశ్రమ రెడీ :సియామ్‌
ఎలక్ర్టిక్‌ వాహనాలు తెచ్చేందుకు ఆటో పరిశ్రమ వేగంగా సిద్ధమవుతోందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. అయితే పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచిస్తున్నారు. ఎలక్ర్టిక్‌ వాహనాలపై ప్రస్తుతం జిఎ్‌సటి 12 శాతంగా ఉందని, దీన్ని 5 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ ఉందని ఆయన చెప్పారు. పన్నుల భారం తగ్గితేనే ఎలక్ర్టిక్‌ వాహనాల ధరలు అందుబాటులోకి వస్తాయని, టెక్నాలజీకి మరింత ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు. గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో విభిన్న విభాగాల్లో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న 28 ఎలక్ర్టిక్‌ వాహనాలను టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌లేలాండ్‌, లోహియా, జెబిఎం వంటి కంపెనీలు ప్రదర్శించాయి.
 
దీన్ని బట్టే ఆటో పరిశ్రమ ఎలక్ర్టిక్‌ వాహనాలు తెచ్చేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోందని మాథుర్‌ తెలిపారు. ప్రదర్శనలో విడుదల చేసిన ఎలక్ర్టిక్‌ వాహనాల్లో 11 కారు సెగ్మెంట్లో, ఐదు బస్‌ సెగ్మెంట్లో, రెండు చొప్పున చిన్న వాణిజ్య వాహనాలు, త్రీవీలర్‌ సెగ్మెంట్లో, ఎనిమిది టూవీలర్‌ సెగ్మెంట్లో విడుదలయ్యాయి. 2030నాటికి ప్రజారవాణాలో 100 శాతం, వ్యక్తిగత రవాణాలో 40 శాతం ఎలక్ర్టిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వంస్పష్టమైన విధానం తీసుకురావడంతోపాటు పరిశ్రమకు, వాహనదారులకు ప్రోత్సాహకాలు కల్పించాలని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. చార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలే ప్రధాన సమస్యగా మారాయని, ఈ సమస్యను అధిగమిస్తే ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం జోరందుకుంటుందంటున్నారు.
 
టూ వీలర్లు..
జనవరిలో టూవీలర్ల అమ్మకాలు 33.43 శాతం వృద్ధి చెంది 16,84,066కు చేరాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో టూవీలర్లు, స్కూటర్లకు గిరాకీ అధికంగా ఉంటోందని, ఫలితంగానే ఈ రంగంలో మెరుగైన వృద్ధి నమోదు అవుతోందని విష్ణు మాథుర్‌ తెలిపారు. జనవరిలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 28.64 శాతం పెరిగి 10,54,062 యూనిట్లకు చేరాయి. హీరో మోటోకార్ప్‌ అమ్మకాలు 24.39 శాతం వృద్ధితో 5,43,325కు చేరుకున్నాయి. హోండా స్కూటర్‌ అండ్‌ మోటార్‌సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) 1,69,537 టూవీలర్లను విక్రయించింది. బజాజ్‌ ఆటో 1,63,111, టీవీఎస్‌ మోటార్‌ 84,140 మోటార్‌ సైకిళ్లను విక్రయించాయి.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.