వివో ఫోన్లు వాడుతున్న వారికి గుడ్ న్యూస్!
12-02-2018 20:57:01
న్యూఢిల్లీ: వివో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుకు ఇది శుభవార్తే. వివో విడుదల చేసిన వివిధ స్మార్ట్‌ఫోన్ల కోసం లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఓరియోను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ‘X’ సిరీస్‌కు చెందిన ఏడు ఫోన్లు వివోX20, వివో X20 ప్లస్, వివో X9ఎస్, వివో X9ఎస్ ప్లస్, వివో X ప్లే6, వివో X9, వివో X9 ప్లస్ ఫోన్లను ఆండ్రాయిడ్ ఓరియోతో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఫన్‌టెక్ ఓఎస్ అప్‌గ్రేడ్‌తో ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానున్నట్టు వివో తెలిపింది.
 
అయితే ఈ వెర్షన్‌ను అధికారికంగా లాంచ్ చేయడానికి ముందు బీటా వెర్షన్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ మొత్తం అప్‌డేట్‌ను ఓవర్ టు ఎయిర్(ఓటీఏ) ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకునేందుకు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం సిస్టం అప్‌డేట్స్‌లోకి వెళ్లి స్టాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివో తెలిపింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.