కీబోర్డ్‌లో ఆ ఫీచర్‌ ఎలా?
11-02-2018 22:48:43
నా ఫోన్లో కీబోర్డ్‌ కొన్ని పదాలను టైప్‌ చేసేటప్పుడు ఆటో సజెషన్ల రూపంలో అవి చూపించబడుతూ ఉండడం చాలా సౌకర్యంగా ఉంది. అయితే నేను తరచూ వాడే కొన్ని పదాలను ఇలా సజెషన్ల రూపంలో ఆ కీబోర్డ్‌ చూపించట్లేదు. ఆయా పదాలకు కూడా సజెషన్లు పొందే అవకాశం ఏదైనా ఉంటే తెలుపగలరు.
 శ్రీనివాస వర్మ, రాజమండ్రి
 
సహజంగా మన ఫోన్‌ లతో పాటు వచ్చే డీఫాల్ట్‌ కీబోర్డ్‌ యాప్స్‌ అంతర్గతంగా ఉండే ఓ డిక్షనరీ ఆధారంగా మనం టైప్‌ చెయ్యబోయే పదాలకు సజెషన్లని ఇస్తుంటాయి. వాటిలో మెషిన్‌ లెర్నింగ్‌ ఏర్పాటు లేకపోవడం వలన కొత్త పదాలను అవి డిక్షనరీలోకి చేర్చుకోవడం కానీ, కస్టమ్‌ డిక్షనరీ ఏర్పాటు గానీ ఉండదు. అలాంటపుఁడు స్విఫ్ట్‌కీ వంటి ప్రత్యేకమైన కీబోర్డును వాడితే అది మనం తరచూ వాడే పదాలను కస్టమ్‌ డిక్షనరీ లోకి స్వీకరించి ఇకపై ఆ పదాలకు కూడా పూర్తిగా టైపు చేయవలసిన పని లేకుండానే సజెషన్లని చూపిస్తుంటుంది. కొన్ని కీ బోర్డు యాప్స్‌లో కస్టమ్‌ డిక్షనరీ క్రింద మనకు కావాల్సిన స్వంత పదాలను స్వయంగా మనమే చేర్చుకునే ఏర్పాటు కూడా లభిస్తూ ఉంటుంది. అలాంటివాటిని వెదికి పట్టుకుని ప్రయత్నించండి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.